శిబిరాలకు విరామం ఇస్తున్నాము: భిక్షమయ్య గురూజీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవజాతి రుగ్మతల భయంతో విలవిలలాడిపోతుంది. వాని పరిష్కారం కోసం అనేకరకాల వైద్యవిధానాలను, చిట్కాలను అనుసరిస్తున్నారు. వాని వలన తాత్కాలికంగా ఉపశమనాన్ని మాత్రమే పొందుతున్నారు కానీ సమూల శాశ్వత పరిష్కారం లభించడంలేదు. అయితే నేను అనుసరించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జీనులయొక్క లోపం వలన నా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించిన అతిభయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతలను సమూలంగా తొలగించుకోవాలనే దృఢసంకల్పంతో 1991లో ఆధ్యాత్మికమార్గంలోనికి ప్రవేశించాను.

గత మూడున్నర దశాబ్దాలుగా ఆధ్యాత్మికమార్గాన్నిగురించి అన్నికోణాల నుండి లోతైన పరిశోధన గాచించి నాజీవితానికి అన్వయించుకొని స్పష్టతను పొందాను. అన్నిరకాలభయంకర రుగ్మతల నుండి సమూలంగా బయటపడ్డాను. ప్రత్యేకించి గత 9 నెలలుగా శరీరం పూర్తిగా ఉత్తేజితమౌతుంది. జీనుల స్వరూపం మారింది. నా జీవితంలో అద్భుతం జరిగింది. ప్రపంచ మానవ చరిత్రలో ఇది నూతన మలుపు అని చెప్పవచ్చు.

అందువలన దానిని ప్రపంచానికి తెలియజేయడం నాకనీస బాధ్యతగా భావిస్తున్నాను. అందుకు ప్రసారమాధ్యమాలను ఉపయోగించుకోవాలను కుంటున్నాను. అందుకు సన్నాహాలు చేస్తున్నాను.

ఇప్పటివరకు అందించిన శిబిరాలను పునర్వవస్థీకరించే కార్యక్రమంలో నిమగ్నమైనాను. అందువలన శిబిరాలకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నాము. అయితే అక్టోబరు, 10-18 వరకు జరగబోయే నిత్యానంద యోగశిబిరం, నవంబరు, 8-16 వరకు జరగబోయే ప్రధమ సంకల్పసిద్ధి యోగ శిబిరములను యధావిధిగా కొనసాగిస్తాము.

శ్రీ గురుసన్నిధి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు సందేశాలు వస్తూ ఉంటాయి. వానిని వింటూ ఆధ్యాత్మిక మార్గంపట్ల అవగాహనను గావించుకుంటారని ఆశిస్తూ… ఆక్షాంక్షిస్తూ…

నిండు మనసుతో ఆశీర్వదిస్తూ…

.-పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ