గురూజీ పరిచయం

సత్యసేవక్ ప్రేమారవింద పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుజిల్లా (విభజన అనంతరం పల్నాడుజిల్లా)లో 1951వ సంవత్సరంలో. ఒకసామాన్య పేదరైతు కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులకు పదకొండవ, చివరిసంతానం కావడం వలన, వారు శారీరకంగా, మానసికంగా బలహీనపడిన తరుణంలో జన్మనివ్వడం వలన అతిభయంకర, వంశపారంపర్య దీర్ఘకాలిక రుగ్మతలకు లోనుకావడం జరిగింది. రక్తహీనత, ఊపిరితిత్తుల అంటువ్యాధి, మలబద్ధకం, సోరియా సిస్ అనబడే మొండి చర్మ వ్యాధితో పాటు, శరీరంలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన శరీరం తరచుగా అంటువ్యాధులకు గురైంది.

అయితే విద్యలో అద్భుతంగా రాణించి హైస్కూల్ స్థాయినుండి మాస్టర్ డిగ్రీవరకు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులై, 1976 నుండి 80 వరకు చిలకలూరిపేటలోని జూనియర్ కళాశాలలో జంతుశాస్త్రంలో జూనియర్ లెక్చరర్ గా, 1980 నుండి 1999 వరకు డిగ్రీకళాశాలలో జంతుశాస్త్ర విభాగపు అధిపతిగా ఉద్యోగబాధ్యతలను నిర్వహించడం జరిగింది.

ఆవిధంగా ఆర్ధికపరమైన ఒత్తిడి నుండి బయటపడినప్పటికీ, వంశపారంపర్య దీర్ఘకాలిక రుగ్మతలనుండి కూడా కొంతవరకు నివారణ కలిగినప్పటికీ, మూలనిర్మాణం మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది. అందువలన అన్నిరకాల రుగ్మతల నుండి సమూలంగా విడుదలై, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది, కుటుంబానికి, వృత్తికి న్యాయంచేయాలనే తపనతో, 1991లో ఆరొగ్యాన్ని పొంది, కుటుంబానికి, వృత్తికి న్యాయంచేయాలనే తపనతో, 1991లో ఆధ్యాత్మికమార్గంలోనికి ప్రవేశించడం జరిగింది. విద్యార్ధి దశనుండి హేతువాద, నాస్తికవాద, వామపక్ష, సైన్సుపరమైన పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను వ్యతిరేకించినప్పటికీ, ఇతరమార్గాలద్వారా ఫలితం లభించనందువలన కేవలం రుగ్మతల నివారణకోసం ఆఖరిఅస్త్రంగా ఈ మార్గాన్ని ఆశ్రయించడం జరిగింది.

అయితే ప్రారంభంలో అశాస్త్రీయవిధానాలను అనుసరించడం వలన, లబ్ది కలగకపోగా కొంతవరకు నష్టం జరిగింది. కానీ ఆధ్యాత్మికమార్గమే అన్నిసమస్యలకు సమూల శాశ్వతపరిష్కారమనే దృఢవిశ్వాసంతో ముందుకు సాగుతూ, 1993లో 2 | గురూజీగా శిక్షణపొంది ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది.

గురూజీగా శిక్షణపొంది ఆధ్యాత్మికప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది. ఆ తదుపరి దానిని సమగ్రంగా, సశాస్త్రీయంగా, సరళంగా, సులభంగా ప్రపంచానికి అందించాలనే సత్సంకల్పంతో విజయవాడను ప్రధానకేంద్రంగా చేసుకొని 1998లో ధ్యానమండలి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించడం, ఆ తదుపరి 1999లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలం సంస్థ కార్యక్రమాలకే కేటాయించడం, 2000 సంవత్సరంలో గురువుల గురుకుల శిక్షణ ద్వారా గురువులను తయారుచేయడం, సమగ్ర విశ్వశక్తియోగచికిత్స ద్వారా అన్నిరకాల రుగ్మతలకు మందులను తయారుచేసి ఉచితంగా అందించడం, దశలవారీగా వివిధరకాల శిక్షణాతరగతులను రూపొందించి ప్రచారం చేయడం, పుస్తకాలను రచించడం, ప్రవచనాలను రికార్డు చేయడం, వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడం వంటి అనేక విధానాల వలన సంస్థ శరవేగంగా విస్తరించింది.

సైన్సును, భౌతికవాదాన్ని, లౌక్యాన్ని, మనస్తత్వాన్ని, మతసామరస్యాన్ని ఆధ్యాత్మికతకు మేళవించి అందించడం వలన నవీన మానవుని మేధస్సును అద్భుతంగా ఆకర్షించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిస్సా, యానాంలలో లక్షలాదిమంది బ్రహ్మోపదేశం ద్వారా మంత్రాన్ని అందుకొని సమాధి అభ్యాసం, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ఎక్సర్సైజ్లు, ఆక్యుప్రెజర్, నాడీశోధన, భజనలు, భక్తిగీతాలతో పాటు, అద్వైతజ్ఞానాన్ని పొందడం వలన అనేకమంది లబ్దిపొందారు.

2020 ఆగష్టు-1 నుండి శ్రీ సత్యసాయి ధ్యానమండలి యూట్యూబ్ చానల్ ద్వారా 2022 జులై-31 వరకు క్రమం తప్పకుండా 567 గురుసందేశాలను అందించడం జరిగింది. గురూజీ అందించే ఆధ్యాత్మిక వైద్యసేవలకు గుర్తింపుగా కేరళలోని కొచ్చిన్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ద్వారా “స్టార్ ఆఫ్ ది మిలీనియమ్“, తమిళనాడులోని తంజావూరు ఇండియన్ హెూలిస్టిక్ మెడికల్ అకాడమీ ద్వారా వైద్యజ్యోతి, పశ్చిమబెంగాల్, కలకత్తాలో, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ అల్టర్నేటివ్ మెడికల్ కౌన్సిల్ ద్వారా సేవారత్న అవార్డు, కర్ణాటకలోని బెంగుళూరులో శ్రీసాయి ఆరోగ్యధామ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా “మేన్ ఆఫ్ ది ఇయర్“, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇండియన్ అకాడమి ఆఫ్ నేచురల్ థెరఫిటిక్స్ ద్వారా “లైఫ్ ఫెలో మెంబర్”, మహారాష్ట్రలోని ముంబాయిలో కాస్మిక్ హీలింగ్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా “స్పీకర్స్ స్పెషల్ అవార్డు మరియు అప్రీషియేషన్ అవార్డు“ను పొందడం జరిగింది. వీనితోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురురత్న, జ్ఞానానంద, భారతనవ నిర్మాణ పరివార్ ద్వారా గాంధీయన్ అవార్డులతో సత్కరించడం జరిగింది. ఆ విధంగా గురూజీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో విశేషం.

ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే గురూజీ ఆధ్యాత్మికసేవలతో పాటు జ్ఞానపరంగా పరిణతిచెందడం వలన 2018వ సంవత్సరం నాటికి శారీరకంగా పూర్తి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు మానసికపరిణతి కూడా ప్రారంభమైంది. వంశపారంపర్యంగా జన్యుపరమైన లోపాల వలన తమ తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్ర మించిన వ్యాధులను కూడా నూటికి నూరుశాతం నివారించుకోవచ్చని గురూజీ తన స్వయం అనుభవం ద్వారా ప్రపంచానికి నిరూపించడం జరిగింది.

అయితే 2020లో కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలలో విస్తరించడం వలన తాత్కాలికంగా బ్రహ్మోపదేశాలను నిలిపివేయడం జరిగింది. వానితో పాటు 2021 ఆగష్టు -30 వ తేదీన మాతాజీ ఆకస్మిక శివైక్యం వలన కొంత నిరాశ కలిగినప్పటికీ, మాతాజీ జీవితాశయాన్ని నెరవేర్చడం కోసం నవీనసాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను అందించాలనే బలమైన దృక్పధంతో నూతన శిక్షణల రూపకల్పనకు శ్రీకారం గావించడం జరిగింది.

ప్రస్తుతం మీరు అందుకోబోతున్న అంతర్ముఖయోగం అనే ప్రాథమిక శిక్షణ మిమ్ములను ఆధ్యాత్మికత వైపుకు మళ్లించే మొదటి అంతస్థు అవుతుంది. ఈ శిక్షణలో బ్రహ్మోపదేశం ద్వారామంత్రాన్ని ఉపదేశించి సమాధి అభ్యాసాన్ని ప్రయోగపూర్వకంగా సాధన చేయించడంతోపాటు అన్నిరకాల రుగ్మతలకు సంబంధించి సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా ఉచితంగా మందులను అందించడం జరుగుతుంది. అంతేగాక శిక్షణను ఉచితంగా అందించడమనేది ఎంతో సాహసోపేత నిర్ణయమని చెప్పవచ్చు. గురూజీ తన స్వయం అనుభవాన్ని మీకు అందించడం వలన ఆధ్యాత్మికమార్గంపట్ల మీకు తప్పక విశ్వాసం కలుగుతుంది. అంతిమంగా మీకు గురూజీ ద్వారా దివ్యాశీస్సులు నందించడం జరుగుతుంది. అందువలన మీరు అరుదుగా లభించే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ…